హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ ఓట్ల పండుగ మొదలైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కావడంతో ప్రజలు ఓటర్ కార్డు తీసుకొని వారి బూత్ లకు పరుగులు తీశారు. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఓట్లు వేయడానికి చాలా మంది వారి ఊర్లకు వెళ్లడంతో మరింత సందడి నెలకొంది. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు భారీ బందోబస్తు నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈసారి ఎన్నికలు నువ్వానేనా అన్నట్టు సాగనున్నాయి. డిసెంబర్ 3న ఎన్నికల రిజల్ట్ తెలియనుంది.
తెలంగాణలో ఇవాళ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రారంభమయ్యింది. ఓటర్లు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకు దాదాపు 30 శాతం పోలింగ్ జరిగింది, సామాన్యులతో పాటు.. సెలబ్రిటీలు కూడా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ (118) కూటమిలో సీపీఐ 111 స్థానాల్లో, బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో, సీపీఎం 19 స్థానాల్లో, బీఎస్పీ 107 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.