రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని కౌకుంట్ల (స్వగ్రామం) లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అంతకు ముందు కుటుంబ సభ్యులతో స్వర్గీయ ఇంద్రారెడ్డి సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రజలను కోరారు.
తెలంగాణలో ఇవాళ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రారంభమయ్యింది. ఓటర్లు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకు దాదాపు 30 శాతం పోలింగ్ జరిగింది, సామాన్యులతో పాటు.. సెలబ్రిటీలు కూడా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ (118) కూటమిలో సీపీఐ 111 స్థానాల్లో, బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో, సీపీఎం 19 స్థానాల్లో, బీఎస్పీ 107 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.