తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 11 గంటల వరకు 20.64 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 30.65 శాతం, అత్యల్పంగా హైదరాబాద్ లో 12.36 శాతం పోలింగ్ నమోదైంది. ఇప్పటి వరకు 3.26 కోట్ల మంది ఓటర్లలో 65 లక్షల మంది ఓటు వేశారు. హైదరాబాద్ లో పోలింగ్ మందకొండిగా సాగుతుంది. ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈసీ కోరుతుంది. సామాన్యులతో పాటు.. సెలబ్రిటీలు కూడా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ (118) కూటమిలో సీపీఐ 111 స్థానాల్లో, బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో, సీపీఎం 19 స్థానాల్లో, బీఎస్పీ 107 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.