ఫొటో గుర్తింపు కార్డు (ఎపిక్), అందని ఓటర్లు, ఓటు హక్కు ఉన్న వారు ప్రభుత్వం గుర్తింపు ఇచ్చిన గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి వెంట తెచ్చుకొని ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఆధార్ కార్డు, పాసుపోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, కేంద్ర, రాష్ట్ర, పబ్లిక్ సెక్టార్, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల ఫొటో గుర్తింపు కార్డు, బ్యాంకులు, పోస్టాఫీసు జారీ చేసిన పాసుపుస్తకం (ఫొటోతో ఉన్నవి), పాన్ కార్డు, జనగణన ఆధారంగా జారీ చేసిన స్మార్ట్ కార్డు, ఎంఎన్ఆర్ఆస్ఈజీఏ జారీ చేసిన జాబ్ కార్డు, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు, ఫొటోతో జత చేసిన పింఛను పత్రాలు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికార గుర్తింపు పత్రం వంటివి తప్పనిసరిగా ఉండాలి.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 11 గంటల వరకు 20.64 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 30.65 శాతం, అత్యల్పంగా హైదరాబాద్ లో 12.36 శాతం పోలింగ్ నమోదైంది. ఇప్పటి వరకు 3.26 కోట్ల మంది ఓటర్లలో 65 లక్షల మంది ఓటు వేశారు. హైదరాబాద్ లో పోలింగ్ మందకొండిగా సాగుతుంది. ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈసీ కోరుతుంది. సామాన్యులతో పాటు.. సెలబ్రిటీలు కూడా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ (118) కూటమిలో సీపీఐ 111 స్థానాల్లో, బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో, సీపీఎం 19 స్థానాల్లో, బీఎస్పీ 107 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.