కోర్టు డ్యూటీ నిర్వహించే పోలీసులు తమ విధులు పకడ్బందీగా నిర్వహించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. శుక్రవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని పోలీస్ స్టేషన్ లలో కోర్టు విధులు నిర్వహించే పోలీసులతో సమావేశం నిర్వహించారు. కేసులు త్వరగా పరిష్కారం అయ్యేలా సమయానికి సాక్ష్యాలను కోర్టుకు అందించాలని చెప్పారు. నేరస్థులకు శిక్షలు పడటంలో కోర్టు డ్యూటీ పోలీసుల పాత్ర కీలకమని అన్నారు.