సేంద్రియ వ్యవసాయంతో రైతులు ఆర్థికాభివృద్ధి చెందే అవకాశం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్త అశోక్ అన్నారు. స్పీడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జపానీ యూనివర్సిటీ విద్యార్థులు శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా నాగర్ దొడ్డి గ్రామాన్ని సందర్శించి పత్తిపంటను పరిశీలించారు. సేంద్రియ సాగు ఉపయోగాలను విద్యార్థులకు వివరించారు. గతంలో ఆవుపేడ మూత్రంతో పైర్లలో స్ప్ర్పే చేసి అధిక దిగుబడితోపాటు రసాయనాలు లేని పంటలు పండించారని తెలిపారు.