నల్గొండ నూతన ప్రభుత్వ వైద్య కళాశాల భవనాన్ని ఆగస్టు చివరినాటికి పూర్తి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో ప్రారంభిస్తామని రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన జిల్లా కేంద్రం సమీపంలోని ఎస్ ఎల్ బి సి కాలనీ వద్ద నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల పనులను జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డితో కలిసి తనిఖీ చేశారు.