తెలంగాణ షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్, హైదరాబాద్ ఆధ్వర్యంలో రెసిడెన్షియల్, UPSC (ప్రిలిమ్స్, మెయిన్స్)కు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారిణి రజిత తెలిపారు. అర్హులైన వందమంది (SC, ST, BC, మైనార్టీ, PWD) అభ్యర్థులకు 10 నెలలపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.