బాన్సువాడ బస్తి దవాఖానలో వైద్యాధికారి పోస్టుకు జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఒప్పంద ప్రతిపాదికన దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిఎమ్ అండ్ హెచ్ ఓ చంద్రశేఖర్ కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ. ఏడాది పాటు పని చేయాలన్నారు. దరఖాస్తుతో పాటు ఎంసీఏ రిజిస్ట్రేషన్, ఇంటర్న్షిప్ సర్టిఫికెట్లు, మార్కుల జాబితా, విద్యార్హత పత్రాలు, కులధ్రువీకరణ పత్రాలను 30లోగా వైద్యశాఖ కలెక్టరేట్ లోని తమ కార్యాలయంలో అందించాలన్నారు.