ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షం కొనసాగుతుంది. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మెగావృతమై ఉంది. దీంతో ఉదయం నుంచి ముసురు కొనసాగగా మధ్యాహ్నం సమయంలో వర్షం పెరిగింది. రానున్న రోజుల్లో జిల్లాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.