పాలమూరు జిల్లా దుస్థితికి బిఆర్ఎస్ పార్టీనే కారణమని శనివారం సీఎం రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. 'కరీంనగర్లో ఓడిపోతా అని తెలిసి కేసీఆర్ పాలమూరుకు వచ్చి ఎంపీగా పోటీ చేస్తే భారీ మెజారిటీతో గెలిపించాం. కానీ ఆయన పాలనలో పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. పాలమూరు-రంగారెడ్డి, కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులను పదేళ్లుగా పట్టించుకోలేదు. గత ప్రభుత్వ హయాంలో వలసలు పెరిగాయి' అని విమర్శించారు.