మండలలోని తాళ్లపూసపల్లి, పర్యటనకు వచ్చిన త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి,గారిని మర్యాద పూర్వకంగా కలిసి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ ఆర్ కేకన్, అభినవ్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వయం సహాయక బృందాలు,సేంద్రియ వ్యవసాయం సాగు చేస్తున్న విధానాన్ని పరిశీలించడానికి వచ్చిన త్రిపుర గవర్నర్ శ్రీ ఎన్.ఇంద్రసేనారెడ్డి,*గారు మాట్లాడుతూ, ప్రధానమంత్రి డ్రోన్ పథకం ద్వారా సులభతరమైన పద్ధతిలో వ్యవసాయం చేయడం కోసం సబ్సిడీ ద్వారా డ్రోన్ తదితర పరికరాలను అందజేయడం జరుగుతుందని అన్నారు.
ప్రస్తుత కాలంలో ప్రకృతి వ్యవసాయం చాలా అవసరమని, ఆర్గానిక్ పంటల సాగు ద్వారా రైతులకు అధిక లాభాలు వస్తాయని అన్నారు,
ప్రతి ఒక్కరు సేంద్రియ ఎరువులు ద్వారా పండించిన పంటలను తీసుకోవడం వలన ఆరోగ్యంగా దృఢంగా ఉంటారని ఆయన తెలిపారు,
పూర్వకాలంలో ఇదే పద్ధతులను కొనసాగించారన్నారు,
పడిపశు సంపద కలిగిన కుటుంబాలు చాల సంతోషంగా ఉంటాయని తెలిపారు, త్రిపుర ఇతర రాష్ట్రాలలో ఆర్గానిక్ పంటలకు అధిక ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు, ప్రధానమంత్రి గారు సేంద్రియ, ప్రకృతి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తారని ఆయన చేసే ప్రతి కార్యక్రమాల్లో ఆర్గానిక్తో కూడిన వంటకాలు భోజనం కల్పిస్తారని అన్నారు,
అంతకుముందు డ్రోన్ టెక్నాలజీతో ఆధునిక వ్యవసాయ పద్ధతులను చేపడుతున్న గుర్రం, మమత, కుంట అమృత చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు,ఈ కార్యక్రమంలో పాల్గొన్న నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, ఆర్డీవో అలివేలు, కార్యక్రమం నిర్వాహకులు జైపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.