రాత్రి రాత్రే మున్నేరు ముంచెత్తడంతో ఎన్నో కాలనీల్లోని ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. వరద బాధితుల్లో ఖమ్మం ఫొటో గ్రాఫర్ కుటుంబాలు కూడా ఉన్నాయి. మానవతా దృక్పదంతో ఖమ్మం ఫొటోగ్రఫీ యూనియన్ నాయకులు వారందరినీ ఆదుకునేందుకు పూనుకున్నారు. సుమారు 26 మందిని తీవ్ర నష్టానికి గురికాగా వారందరికీ తక్షణ సహాయం చేశారు. జిల్లా యూనియన్ ఫండ్, రాష్ట్ర యూనియన్ ఫండ్, ఖమ్మం ఫొటో గ్రాఫర్స్ విరాళాలు, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ. 10 లక్షలు విరాళాలు సేకరించారు.
26 కుటుంబాలకు రూ.35 వేలు నగదు, రూ. 3వేల విలువ గల నిత్యావసరాలు అందజేశారు. ఫొటోగ్రాఫర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు నాగరాజు దేవర అధ్యక్షతన ఖమ్మం సిటీలోని జూబ్లీక్లబ్ బాధిత కుటుంబాలకు అందజేశారు. కార్యక్రమం లో రాష్ట్ర కార్యదర్శులు మారగని వెంకట్, కన్నె గుండ్ల అశోక్, జిల్లా కోశాధికారి ఆర్ కే బాబాయ్, ఖమ్మం పట్టణ అధ్యక్షులు కమఠం రఘు, సెక్రెటరీ ఖాజబాబా, కోశాధికారి నీరుడు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.