జగిత్యాల జిల్లా బుగారం మండల కేంద్రంలో ఎమ్మెల్యే విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎరువుల గోదామును ప్రజలకు అనువైన పద్ధతిలో అందుబాటులో రైతులకు ఇబ్బంది కలగకుండా ఎరువుల గోదామును ప్రారంభించడం జరిగింది.
రైతులకు ఎలాంటి అవసరాలు ఉన్న నా దృష్టికి తీసుకొస్తే మీకు తప్పకుండా నేను పనులు చేస్తానని హామీ ఇచ్చారు. రైతులు ఏ సమయమున అయినా సరే ఏ అవసరము ఉన్న నా వద్దకు వచ్చి కలిసి నాకు తెలియజేయవచ్చు రైతులకు ప్రతి సమయమున మీకు అందుబాటులో ఉంటాననితెలియజేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల పథకాల విషయాలు వందకు వందశాతం అమలు చేయడం జరుగుతుంది ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా సంబంధిత అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని కూడా తెలిపాము ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా నన్ను స్వయంగా కలవచ్చు అని కూడా సభ ముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట బుగ్గారం మండలం కాంగ్రెస్ అధ్యక్షులు వేముల సుభాష్ కాంగ్రెస్ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.