జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గ్లోబల్ హైస్కూల్ ప్రిన్సిపల్ డాక్టరెట్ నక్కరాజు మట్టి గణపతులను పూజ ప్రతిష్టాపనకు ప్రవేశ పెడితే బాగుంటుంది పర్యావరణాన్ని కాపాడినట్టు ఉంటుంది కావున భక్తులందరూ మట్టి గణపతులకే ముందుకు రావాలంటు ఒక ప్రకటనలో తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉందన్నారు.
మట్టి గణపతులను ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మరియు రకరకాల రసాయనాలతో తయారు చేసే విగ్రహాలు నీటిలో కరగడానికి చాలా సంవత్సరాలు పడుతుంది మనుషులకు గాని పశువులో గాని హానికరం, దాంతో పాటు ఆ నీరు కలుషితం అవుతుంది ఆ నీరు తాగిన పశువులకు వివిధ రకాల వ్యాధులు సోకే అవకాశం ఉంటుందనీ తెలిపారు. చెరువు మట్టితో తయారు చేసే విగ్రహాలు నీటిలో తొందరగా కరగడంతో పాటు రైతులకు మేలు చేకూరుతుంది పర్యావరణానికి కూడా ఎలాంటి హానీ జరగదనీ అన్నారు. ఈ సందర్భంగా బుగ్గారం మండల ప్రాంత ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ గణపతి పండుగ సందర్భంగా తెలియ జేశారు.