పేషెంట్ లు క్రిటికల్ పరిస్థితిలో ఉన్నప్పటికీ ధైర్య సాహసాలతో ఆపరేషన్లు చేస్తున్న సిబ్బందిని అభినందించిన జిల్లా కలెక్టర్ప ద్దపల్లి జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రి సేవలు పకడ్బందీగా నిర్వహిస్తున్నారని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.గురువారం రోజున జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి మాతా శిశు ఆసుపత్రిలో ఇటీవల సిజేరియన్ ఆపరేషన్లు సక్రమంగా జరిపి తల్లి బిడ్డ ప్రాణాలు రక్షించడంలో డాక్టర్ల పాత్ర చాలా అమూల్యమైనదని అన్నారు.
దొంగతుర్తి గ్రామానికి చెందిన మౌనిక భర్త సంపత్ కుమార్ ఆగస్టు 24వ తేదీన పెద్దపల్లి మాతా శిశు ఆసుపత్రిలో రక్తకణాలు 70 వేలతో అడ్మిట్ అవగా పేషెంట్ కు కావలసిన అన్ని జాగ్రత్తలు ప్లేట్లెట్స్ మరియు ప్లాస్మా ట్రాన్స్ ఫ్యూజ్ చేసి 25 వ తేదీన ఆపరేషన్ చేయడం జరిగిందని ఈ ఆపరేషన్ లో తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు.అలాగే పెద్దపల్లికి చెందిన సయ్యద్ చాందిని భర్త యాకోబుద్ధిన్ క్లిష్ట పరిస్థితులలో ఆపరేషన్ చేసినప్పుడు తీవ్ర రక్తస్రావం జరిగిందని దీంతో వెంటనే డాక్టర్ల బృందం అప్రమత్తమై మూడు యూనిట్ల బ్లడ్ పేషెంట్ కు అందించారని మరియు పేషెంట్ తెల్ల రక్త కణాలు 30 వేల స్థాయికి చేరి ప్రమాదకరంగా ఉన్నప్పుడు మాతా శిశు వైద్యులు అందరూ ఒక టీం గా ఏర్పడి పేషంట్ కి సెప్సిస్ తగ్గించడం జరిగిందని దీంతో తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు.మరియు మేడే స్వాతి గ్రామం గంగారం హైబీపీతో ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వగా 9 నెలల కాన్పుతో ఈ పేషెంట్ కి హై రిస్క్ ఉన్నందున తగిన చికిత్స చేసి ఆపరేషన్ చేశారని స్వాతికి 4.6 కేజీల బిడ్డ జన్మించడం విశేషమని ఈ మూడు ఆపరేషన్లు విజయవంతంగా జరిగించిన మాతా శిశు ఆసుపత్రి డాక్టర్లను, డి.సి.హెచ్.ఎస్ డాక్టర్ శ్రీధర్,డిఏంహెచ్ఓ డా.ప్రమోద్ కుమార్ ను కోయ శ్రీహర్ష అభినందించారు.