అధిక వర్షాల వల్ల రైతులు సాగుచేసిన పంటలకు నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఎకరాకు 30 వేల నష్టపరిహారం చెల్లించాలని ఇటిక్యాల మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ గుప్తా అన్నారు. గురువారం ఇటిక్యాల గ్రామంలో వర్షాల వల్ల నష్టం జరిగిన పత్తి పంటలను రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు గ్రామాల్లో పంటలను పరిశీలించి పంట నష్టం పై అధికారులకు నివేదిక అందించాలని కోరారు. అలాగే జిల్లా ఉన్నత స్థాయి అధికారులు గ్రామాల్లో పర్యటించాలని కోరారు.
ఇటిక్యాల గ్రామంలో సుమారు 400 ఎకరాల వరకు పంట నష్టం జరిగిందని తెలిపారు. కౌలు రైతుల పరిస్థితి మరి దారుణంగా తయారయిందని అటు కౌలు ఇటు పంట నష్టం జరగడంతో కోలుకోని స్థాయిలో కౌలు రైతుల పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఏటు చూసిన నష్టం జరిగిన పత్తి పంటలే కనిపిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టం జరిగిన ప్రతి రైతు ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఎకరా పంట నష్టానికి 30 వేల సహాయాన్ని వెంటనే అందించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు.