జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని అగ్గిమల్ల,గుంజపడుగు గ్రామాలలో 1762గొర్రెలు మరియు 243 మేకలకు ఉచిత పి పి ఆర్ వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగింది.ఈ కార్యక్రమం ఈ నెల 18 తేదీ వరకు కొనసాగుతుందని పశువైద్యాధికారి రవీందర్ అన్నారు.
జూన్ -జులై నుండి డిసెంబర్ వరకు పశువులలో వివిధ రకాలైన గలీకుంటూ వ్యాధి,నిలినాలుక వ్యాధి,చిటుకు రోగం,న్యూమోనియా,పీపీఆర్ వ్యాధి లాంటి ప్రాణంతక వ్యాధులు వస్తుంటాయి.అందులో ఈ పీపీఆర్ వ్యాధి ఒకటి.
ఈ వ్యాధి మోర్భిల్లీ వైరస్ వల్ల సోకుతుంది.ఇది వ్యాధి సోకిన పశువు యొక్క ముక్కునుండి,నోటినుండి కారే శ్రావల ధ్వారా,& దగ్గడం తుమ్మడం ధ్వారా మరొక పశువుకి వ్యాప్తి చెందుతుంది.
వ్యాధి లక్షణాలు :
అధిక జ్వరం (106F)
నోట్లో నాలుకపై,చిగుర్లపై పుండ్లు తధ్వారా మేత మేయలేకపోవడం నిరసించిపోవడం,డైఏరియా (పుర్రు) న్యూమోనియా (దగ్గడం)
వ్యాధి నివారణ:
ప్రతి సంవత్సరం PPR వాక్సిన్ తప్పకుండా వేయించుకోవాలి ( ప్రత్యేకంగా కొత్తగా పుట్టిన జీవాలలో తప్పనిసరిగా వేయించాలి )
ఒక వేల వ్యాధి సోకితే ఆ జీవలను వేరు చేసి వైద్యం చేయించాలి
నోటిలోని పుండ్లను kmno4 తో కడిగి బోరిక్ ఆసిడ్ గ్లిషరిన్ పూత పూయాలి పెయిన్ కిల్లర్స్ ఆంటిబయోటిక్స్ మరియు మల్టీవిటమిన్ ఇంజెక్షన్స్ వాడాలి.