గాజులరామారం డివిజన్ చంద్రగిరి నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన "షైన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్" నూతన కార్యాలయాన్ని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె.పి. వివేకానంద మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో "నిర్మాణ మరియు ఇంటీరియర్ రంగాలు అతివేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, నిర్మాణ రంగంలో "షైన్ కన్స్ట్రక్షన్స్ అత్యంత ఆదరణ పొంది ప్రత్యేక గుర్తింపును సాధించాలన్నారు.
ఈ కార్యక్రమంలో గాజులరామారం డివిజన్ అధ్యక్షులు విజయ రాం రెడ్డి, సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ నవాబ్, రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షులు ఎత్తిరి మారయ్య, నాయకులు ఇబ్రహీం ఖాన్, సుంకరి చందు, తారా సింగ్, బోయిని మహేష్, ఇమ్రాన్ బేగ్, ఫెరోజ్, ఇస్మాయిల్, ఉపేందర్ రెడ్డి, జహంగీర్ ఖాన్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.