ధర్మారం మండలంలోని నంది మేడారం గ్రామంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపును గురువారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ...ధర్మారం మండలంలోని పత్తిపాక గ్రామంలో జ్వరాలతో గ్రామస్తులు బాధపడుతున్న విషయం తెలిసిన వెంటనే గ్రామంలో పర్యటించి జిల్లా కలెక్టర్ మరియు వైద్య అధికారులతో మాట్లాడి హెల్త్ క్యాంపు ను ఏర్పాటు చేయడం జరిగిందని,అదే విధంగా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి మేడారం గ్రామంలో కూడా హెల్త్ క్యాంపును ఏర్పాటు చేయడం.
జరిగిందని,మేడారం గ్రామ ప్రజలు మరియు చుట్టూ ప్రక్కన ఉన్న గ్రామాల ప్రజలు కూడా ఇట్టి హెల్త్ క్యాంపును వినియోగించుకోవాలని,ఇప్పటికీ 100 మందికి పైగా ప్రజలకు టెస్ట్లు చేయించుకోవడం జరిగిందని,సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,ప్రజలు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదనీ,ప్రభుత్వ ఆసుపత్రిలో,మెడిసిన్స్,టెస్ట్ కిట్లు అందుబాటులో ఉంచడం జరిగిందని,ప్రభుత్వ ఆసుపత్రిలో అనుభవం కలిగిన వైద్యులు ఉంటారని,ప్రభుత్వ ఆసుపత్రికి ప్రజలు వెళ్ళాలని,ప్రతి గ్రామంలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ప్రతి ఇంటికి వెళ్లి జ్వరాలతో బాధపడుతున్న వారి వివరాలు అడిగి తెలుసుకోవాలని,ఎవరికి ఎటువంటి అవసరం ఉన్న మా దృష్టికి తీసుకురావాలని ఈ సంధర్బంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.