చందంపేట మండలంలోని హ్యంక్య తండా గ్రామ పంచాయతీ పరిధిలోని లేడ్పతండ నుండి కొరట్ల వరకు ఎస్ టి ఎస్ డి ఎఫ్ నిధుల నుంచి మంజూరు అయినా రూ.2.25కోట్ల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ హాజరై,సీసీ రోడ్డు పనులను శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామ నాయకులు,కార్యకర్తలు ఎమ్మెల్యే ని శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఆయా ప్రాంతాల్లో పెండింగ్ లో ఉన్న పనులను త్వరలోనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఏ ఈ ఈ శాఖ అధికారులు శ్రీనివాస్, డి ఈ ఈభాస్కర్,ఈఈ ఖాజాన్ గౌడ్, ప్రజా ప్రతినిధులు, యువజన విభాగ నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు,గ్రామ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.