పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ సిబ్బందిచే మెడికల్ క్యాంపు నిర్వహించడాం జరిగింది.ఈకార్యక్రమంలో మున్సిపల్ ఆఫీసు, శానిటేషన్ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.ఈకార్యక్రమనికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ డా,,దాసరి మమత రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా ఛైర్ పర్సన్ మాట్లాడుతు సఫాయి అన్న సలాం అన్న సఫాయి అమ్మ సలాం అమ్మ అనే నినాదంతో ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు నిత్యం శానిటేషన్ పనుల్లో నిమగ్నమయి అలాగే ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మన పట్టణంలో మురికికాలువలో,రోడ్లపై ఉన్న చెత్తను, పట్టణాన్ని శుభ్రం చేస్తున్న వారి ఆరోగ్యం పట్ల మా కౌన్సిల్ శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని అందులో భాగంగానే ఈరోజు మెడికల్ క్యాంపు ఏర్పాటు చెయ్యడం జరిగింది.
అని మీఇంట్లో వెళ్లే చెత్తను రోడ్లపై మురికికాలువలో వేయకుండా మా మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి అందచేసి వారిని గౌరవించాలని అన్నారు. మేము అడగ్గానే మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసిన జిల్లా మెడికల్ అధికారి డా,,ప్రమోద్ కుమార్ వారి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు.ఈకార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ ఆకుల వెంకటేష్,కౌన్సిలర్ షాహీధ సబీర్ ఖాన్ మున్సిపల్ సిబ్బంది ,పీ హెచ్ సీ రాగినెడు ఎమ్ ఎల్ హెచ్ సీ మమత,ఏఎన్ఎం నిర్మల,ల్యాబ్ టెక్నీషియన్ అభిషేక్,ఆశ వర్కర్లు మమత,మాలతి,పద్మ,వాణి పాల్గొన్నారు.