ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎం అండ్ హెచ్ ఓ తనిఖీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 06, 2024, 04:27 PM

ఆత్మకూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఆరోగ్య అధికారి లలితాదేవి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. తొలుత రికార్డులను, మందులను పరిశీలించారు ఈ సందర్భంగా డిఎంహెచ్వో లలిత దేవి మాట్లాడుతూ ఆత్మకూర్ వైద్యాధికారి డాక్టర్ స్పందన, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ప్రస్తుత సీజన్ లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దోమల ద్వారా విష జ్వరాలు తదితర రోగాల బారిన ప్రజలు పడే అవకాశం ఉందని, ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తంగా అందుబాటులో ఉండి ప్రజలకు సరైన వైద్యం చేయాలని , అదేవిధంగా మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు, డ్రై డే సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి జ్వర సంబంధమైన సర్వేలను నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com