మేము బ్రతకాలంటే.. కోళ్ల ఫారం తొలగించండి సార్.. కోళ్ల ఫారం అయి ఉండాలంటే మాకు విషం పెట్టి చంపండి సార్ అంటూ రైతులు మహిళలు అధికారుల కాళ్లు మొక్కారు. గురువారం ఆత్మకూరు మండలం నీరుకుల్ల గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం సమీపంలో ఉన్న కోళ్లపారాన్ని జిల్లా పంచాయతీ అధికారి ఎల్ లక్ష్మీ రమాకాంత్ , జిల్లా పశువైద్యాధికారి వెంకట్ నారాయణ, పరకాల ఆర్డిఓ నారాయణ, తహసిల్దార్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, మండలం పశువైద్యాధికారి డాక్టర్ ధర్మనాయక్, తో కూడిన బృందం కోళ్ల ఫారం ను పరిశీలించారు.
అక్కడికి వచ్చిన రైతులు గ్రామస్తులు మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి అధికారులకు వల్ల గోడు వెల్లబోసుకున్నారు. ఈ దుర్వాసన దుర్గంధంతో నిత్యం చస్తున్నాం సార్ వ్యవసాయ పనులు చేసుకోలేకపోతున్నాం. దేవాలయానికి వస్తే దేవుని కూడా మొక్కుకోకుండా వెళ్ళిపోతున్నాం. గీత కార్మికులు కల్లు అమ్ముకోకుండా ఈగలను చూసి దుర్వాసనకు ఎవరు రావడం లేదంటూ అధికారులకు గోడు వెళ్ళబోసుకొని వాళ్ల కాళ్లు మొక్కారు. మీరే మాకు న్యాయం చేయాలి సార్.. లేనిపక్షంలో మాకు విషమిచ్చైన మీరే చంపండి సార్ అంటూ రైతులు మహిళలు కన్నీరు పెట్టుకున్నారు. మాకు బ్రతికే అవకాశాన్ని.. మీరే కల్పించాలి అంటూ అధికారులను ప్రాధేయపడ్డారు. వ్యవసాయ పనులు చేసుకో లేకుండా పోతున్నాం మాకు బతుకు తెరువు లేకుండా పోతుంది మీరు వెంటనే కోళ్ల ఫారం తొలగించకుంటే రైతులను గ్రామస్తులు అందరము కలిసి కలెక్టర్ కార్యాలయం ముందు ఆమరణ నిరాహార