జిల్లాను మున్నేరు,అకేరు రూపంలో భారీ వరదలు ముంచెత్తడంతో వేలాదిమంది కట్టుబట్టలతో ఇండ్లు వదిలి పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు.వరద సృష్టించిన బీభత్సంలో సర్వం కోల్పోయిన బాధితులకు ఎర్రజెండా అండగా నిలిచింది.గత నాలుగు రోజులుగా పలు గ్రామాల్లో,కాలనీల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ సీపీఎం బాధితులకు అండగా ఉన్నది.మండలంలోని కస్నాతండా గ్రామంలో అకేరు వరదలో సర్వం కోల్పోయిన గ్రామస్తులకు మద్దులపల్లి సీపీఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో గురువారం భోజనాలు,300 మందికి బట్టలు పంపిణీ చేశారు. మండలంలోని వాల్యా తండాలో సీపీఎం నాయకులు పొన్నం వెంకట రమణ విజ్ఞప్తి మేరకు ఐఎంఏ ఆధ్వర్యంలో గ్రామస్తులందరికి దుప్పట్లు పంపిణీ చేశారు.
ఈ దుప్పట్లను ఖమ్మం పట్టణ ప్రముఖ వైద్యులు యలమూడి కావ్యచంద్ పంపిణీ చేశారు.మండలంలోని జలగం నగర్,కాల్వ ఓడ్డు ప్రాంతాల్లో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి(కెవిపియస్)ఆధ్వర్యంలో బాధితులకు పాల ప్యాకెట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్య వీరభద్రం,కెవిపియస్ జిల్లా కార్యదర్శి నందిపాటి మనోహర్ లు మాట్లాడారు.ప్రకృతి సృష్టించిన వరదల్లో చిక్కుకొని వేల కుటుంబాలు రోడ్డున పడి సాయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో వారిని ఆదుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులను ఆదుకోవడంలో సీపీఎం ఎప్పుడు ముందంజలో ఉంటుందన్నారు.ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించి అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టించాలన్నారు.వరద ముప్పు ప్రాంతాల్లో మౌళిక వసతులు పెంచాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం 10 వేలతో సరిపెట్టకుండా వరద సహాయాన్ని పెంచాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు పెంట్యాల నాగేశ్వరరావు,బుచ్చిరాములు,దొడ్డ భారతమ్మ,అవిరేణి నాగరాజు,రాములు, శివరాం,కోటయ్య,భూక్య ఉష శ్రీ,యాలముడి రవీందర్,అమెరికన్ బయోకేర్ మేనేజర్ ప్రసాద్,సీపీఎం నాయకులు అద్దంకి తిరుమలయ్య,పొన్నం భాస్కర్,కారుమంచి గురవయ్య,వెంకన్న, నాగరాజు,దినేష్,కృష్ణ, హరి,మోహన్,కెవిపియస్ నాయకులు పాపిట్ల సత్యనారాయణ, వెలుతురు పుల్లారావు, నూకల బాలరాజు,ప్రభు దాస్, నాగేశ్వరరావు, వెంకమ్మ,మంగమ్మ,దివ్య,కవిత తదితరులు పాల్గొన్నారు.