వికారాబాద్ జిల్లా లో బీసీ కుల గణన చేయాలని జిల్లా కలెక్టర్కు జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కే యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో మెమోరండం ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంఘం చైర్మన్ గొరిగి మల్లేష్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా బీసీలు ఈ కులగనున లేనందున అన్యాయానికి గురైనారన్నారు వెంటనే కులగలనని చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు.
ఈ విషయాన్ని కలెక్టర్ కు విన్నవించగా కలెక్టర్ సానుకూలంగా స్పందించి ప్రభుత్వానికి పంపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంఘం యూత్ అధ్యక్షులు నీల వెంకటేష్ గారు రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు జిల్లా పెళ్లి అంజి రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి రవి యాదవ్ గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సతీష్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.