వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దామని ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు.
భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత వాతావరణం కల్పించడం, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. పర్యావరణం పట్ల ప్రజలను చైతన్య పర్చడంలో భాగంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు.