రాజోలి శివారులోని సుంకేసుల జలాశయానికి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. శుక్రవారం ఎగువ ప్రాంతాల నుంచి 21,700 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.
దీంతో ఐదు గేట్లను ఒక మీటరు మేర ఎత్తి, 19,900 క్యూసెక్కుల నీటిని దిగువనున్న శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నట్లుగా జేఈ రాజు తెలిపారు. 1.23 టీఎంసీల పూర్తి స్థాయి నీరు నిల్వ సామర్థ్యం కాగా 1500 క్యూసెక్కులను కేసీ కాలువకు విడుదల చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు.