పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత అంశంపై తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది. అప్పటిలోగా నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా కేసు విచారిస్తామని పేర్కొంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని ఇటీవల బీఆర్ఎస్ నేతలు కౌశిక్‌రెడ్డి, వివేకానందగౌడ్ పిటిషన్ వేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు.