భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరియు భారత కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జాతీయ అంతరిక్ష దినంగా జరుపుకునే ఆగష్టు 23వ తేదిని పురస్కరించుకుని దేశ స్థాయిలో విద్యార్థులకు జాతీయ అంతరిక్ష దినోత్సవ క్విజ్ -2024 పేరున పోటీ నిర్వహించడం జరిగింది దేశ వ్యాప్తంగా ఆగష్టు నుండి సెప్టెంబర్ వరకు పోటీలు నిర్వహించారు.
ఈ పోటీలో మొుత్తం దేశ వ్యాప్తంగా 3 లక్షల మంది పాల్గొన్నారు. వాటిలో100 మందిని ఎంపిక చేసి వారికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వారు ప్రసిద్ధ అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రం , శ్రీహరి కోటను సందర్శించే అవకాశం కల్పించడం జరుగుతుంది. ఈ పోటీలలో కోదాడకు చెందిన తేజ విద్యాలయ విద్యార్థులు 200 మంది పాల్గొన్నారు. వీరిలో 7వ తరగతి చదువుతున్న గుజ్జుల హర్ష వర్దన్ రెడ్డి ఈ మెుదటి వంద మందిలో నిలిచి అక్టోబర్ 23వ తేదిన శ్రీహరికోటను సందర్శించే బృందంలో స్థానం సాధించాడు. ఈ సందర్భంగా పాఠశాలలో ఎర్పాచు చేసిన కార్యక్రమంలో హర్షవర్ధన్ రెడ్డి కి ఈనెల 23న శ్రీహరికోటను సందర్శించే అవకాశం లభించడం సంతోషంగా ఉందని విద్యార్థి తో పాటు సంరక్షకునిగా అధ్యాపకుడు కిషోర్ రెడ్డి కూడా వెళ్లడం జరుగుతుందని తేజ విద్యాలయ ప్రిన్సిపాల్ వి.రమాసోమిరెడ్డి తెలిపారు.