ఈరోజు "వాక్ ఫర్ ఫ్రీడమ్ నిశ్శబ్ద నడక"అనే కార్యక్రమాన్ని అంతర్జాతీయ ఎన్జీవో ఆస్ట్రేలియా ఏ 21 మరియు ది మూమెంట్ ఇండియా ముంబై వారి సహాయ సహకారాలతో గ్రామ జ్యోతి సొసైటీ మదనపల్లి వారి సౌజన్యంతో దేశ స్థాయిలో జరుగుతున్నాయి స్థానిక ఎన్జీవో " శ్రీ ధరణి వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హై స్కూల్ పిల్లలతో నెక్కొండ మండలం వరంగల్ డిస్ట్రిక్ట్ యందు మానవ ఆక్రమరవాణా పై నిశ్శబ్ద ర్యాలీ నిర్వహించడము జరిగినది. సంస్థ అధ్యక్షురాలు కే.శోభరణి గారి ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు స్వేచ్ఛ కోసం నడకనే బహుత్తర సైలెంట్ వాక్కును నిర్వహించడము జరిగినది.
ఈ బహుత్తర కార్యక్రమానికి వక్తలు మాట్లాడుతూ ఇది స్వాతంత్రం కోసం మేము నడిచే నడక న్యాయం మరియు మానవ గౌరవం కోసం నడిచే నడక ఆశా మరియు పునరుద్ధరణ కోసం నడిచే నడక ప్రతి అడుగులో బానిసత్వాన్ని నిర్మూలిస్తాం బానిసత్వం లేని ప్రపంచం సాధ్యమే మానవ అక్రమ రవాణా జీవితాలను నాశనం చేస్తున్న స్వేచ్ఛకు అంతిమ గెలుపు ఉంటుందని మాకు తెలుసు ప్రతి ఒక్క అడుగులో అనేకమందిని చేరుకోవడం మేము చూస్తాం ప్రతి ఒక్క అడుగులో అనేకమంది బాధితులు రక్షింపబడటం మేము చూస్తాం. ప్రతి ఒక్క అడుగులో మేము మరిన్ని ప్రాణాలు పునరుద్ధరించడానికి చూస్తాం.
బానిసత్వం ఇప్పటికీ ఉంది కానీ మేము దాన్ని ప్రతి చోటా మరి ఎప్పటికీ రద్దు చేస్తాం ప్రస్తుతం 21 శతాబ్దంలో కూడా బానిసత్వం ఇంకా ఉంది కానీ వ్యక్తులు వస్తువులుగా కొనబడుతున్నారు మరియు విక్రయించబడుతున్నారు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 2024 ప్రపంచవ్యాప్తంగా 49.6 మిలియన్ల మంది ప్రజల అవయవాల దోపిడి లైంగిక శ్రమ బలవంతపు వివాహాలు మరియు గృహ ధాన్యంతో సహా వివిధ రకాల ఆధునిక బానిసత్వంలో చిక్కుకొని ఉన్నారు అంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 150 మందిలో ఒక్కరు బానిసలుగా ఉన్నారు.
బాలికలు ప్రధానంగా లైంగిక దోపిడీకి మహిళలు బాలికలు చిన్నారులే బలే అవుతున్నారు అబ్బాయిలు బలవంతపు శ్రమ కొరకు వాడబడుతున్నారు గృహంస బలవంతపు వివాహం సైనికత్వం మొదలైన వాటికోసం దోపిడీ చేస్తున్నారు. మానవ క్రమ రవాణా లేని సమాజాన్ని మనం అందరూ చూడాలనుకుంటున్నాం అందరికీ అవగాహన కల్పిస్తూ అలా జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత వహిస్తారని ఉమెన్ ట్రాఫి కింగ్ కు గురైన వారు హెల్ప్ లైన్ నెంబర్లను తెలియజేస్తూ 1098..181 ప్రజలు అప్రమత్తంగా ఉండి తనను తాను రక్షించుకోవాలని ప్రతి విషయంలో అవగాహన కలిగి ఉండాలని ఈ నిశ్శబ్ద నడక ద్వారా మీకు తెలియజేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ప్రధాన ఉపాధ్యాయులు రంగారావు పోలీస్ కానిస్టేబుల్ దర్శనం క్రాంతి కుమార్ ప్రముఖ వైద్యులు ఈదు నూరి రాఘవులు ఉపాధ్యాయులు ఐలయ్య లక్ష్మణ్ శ్రీదేవి వినయ్ కోబ్రా మేడం ఉమాదేవి పూర్ణిమ సుధాకర్ రాఘవన్ మీడియా సిబ్బంది మరియు స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు కోఆర్డినేటర్ ఇదినూరి రమేష్ జి.సౌజన్య . శ్వేత ఏ.గౌతమ్ పాల్గోన్నారు సంస్థ అధ్యక్షులు కే. శోభరణి ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.