TG: విద్యుత్ ఛార్జీలు పెంచేలా ఆ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై నేటి నుంచి 5 రోజుల పాటు విద్యుత్ నియంత్రణ మండలి విచారణ చేపట్టనుంది. 2024-25లో రూ.1200 కోట్ల మేర ఛార్జీలు పెంచేందుకు అనుమతివ్వాలని TGSPDCL/TGNPDCL కోరుతున్నాయి. HT కేటగిరీ విద్యుత్ ఛార్జీల పెంపు, LT కేటగిరీలో నెలకు 300 యూనిట్లకు పైగా వాడే వారికి ఫిక్స్డ్ ఛార్జీల పెంపునకు డిస్కంలు ప్రతిపాదించాయి. నవంబర్ 1 నుంచి ఛార్జీలు పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.