బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి ఏడు పదుల వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఆయన ఏది చేసినా, ఏం మాట్లాడినా వైరల్ అవుతుంటుంది. తాజాగా ఆయన మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తన మనవరాలి పెళ్లి సంగీత్ కార్యక్రమంలో డ్యాన్స్ ని ఇరగదీశారు. వైట్ కలర్ సూటుబూటులో మరికొందరితో కలిసి ఆయన అదిరిపోయే స్టెప్పులు వేశారు. తన మనవరాలు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహం ఈ నెల 27న జరగనుంది. ఈ పెళ్లి సంగీత్ కార్యక్రమంలో ఆయన 'డీజే టిల్లు' పాటకు డ్యాన్స్ చేశారు. మల్లారెడ్డి డ్యాన్స్ కు చెందిన వీడియో సోషల్ మీడియో వైరల్ అవుతోంది. ఈ వయసులో కూడా మల్లారెడ్డి చేసిన డ్యాన్స్ చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు