రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా మాజీ మంత్రి,బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుపై కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలోనే మాజీ మంత్రికి వ్యతిరేకంగా బేగంబజార్ పోలీస్ స్టేషన్లో తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఫిర్యాదు చేశారు.
సీఎంపై రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో హరీశ్ రావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.