గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ ఫలితాలలో పిఇటి జిల్లా టాపర్గా నిలిచిన గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన అంకం శేఖర్ ను ఘనంగా సన్మానించిన పద్మశాలి సంఘం సభ్యులు.శేఖర్ పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూనే డీఎస్సీకి ప్రిపేర్ అవ్వగా గత నెలలో విడుదల చేసిన డీఎస్సీ ఫలితాల్లో పిఇటీ జగిత్యాల జిల్లా టాపర్గా నిలిచాడు.ఈ సందర్భంగా శేఖర్ ను సంఘ సభ్యుల సమక్షంలో గొల్లపల్లి పద్మశాలి సంఘ భవనంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత శేఖర్ ను స్ఫూర్తిగా తీసుకొని లక్ష సాధన కోసం కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు చౌటపెల్లి తిరుపతి,ప్రధాన కార్యదర్శి అందే లక్ష్మణ్,కోశాధికారి అంకం లింబాద్రి,మండల ప్రధాన కార్యదర్శి అంకం భూమయ్య,పట్టణ ఉపాధ్యక్షులు ఎలగందుల శంకర్,యువత అధ్యక్షులు అంకం రవి,సభ్యులు గూడూరు రాజన్న,అంకం అంజయ్య,గుండేటి సత్యనారాయణ,చౌటపల్లి తిరుపతి,గాజెంగి హనుమన్లు,సంఘ సభ్యులు పాల్గొన్నారు.