జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాలు మేరకు బుగ్గారం మండల నాయకులు ఈరోజు బుగ్గారం ఎక్స్ రోడ్డు రహదారిపై బయటయించి ధర్నాలో పాల్గొని రాస్తారోక నిర్వహించారు.
స్థానిక వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్నటి ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలకు బి ఆర్ఎస్ నాయకులు మండిపడి రైతులకు ఇప్పటివరకు రైతు భరోసా లేదు, రుణమాఫీ లేదు, లేనిపోని హామీలు ఇచ్చుకుంటూ కాలాన్ని వృధా చేస్తున్నారంటూ రైతులను బాధలో ముంచేస్తున్నారంటూ రైతుల తరఫున బి ఆర్ ఎస్ పార్టీ ఏది ఏమైనా నిటారుగా నిల్చొని రాస్తారోక చేయక తప్పదని స్థానిక ప్రభుత్వం రైతులను అణచివేసే విధంగా ఆలోచన చేస్తున్నదంటూ బి ర్ ఎస్ నాయకులు కార్యకర్తలు మండిపడుతూ ఈ ధర్నాచేయడం జరిగింది.
ఇప్పటికైనా స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ కానీ రైతు భరోసా గాని అమలు చేసి వెంటనే అందించాలని బి ఆర్ఎస్ నాయకులు తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బుగ్గార మండల మాజీ బి ఆర్ ఎస్ అధ్యక్షులు గాలిపల్లి మహేష్, గ్రామ శాఖ అధ్యక్షులు పూర్ణచందర్ యూత్ కమిటీ ప్రెసిడెంట్,కట్ట రాజేందర్,పొన్నం సత్యన్న , సిరి నేని మల్లేశం, బుగ్గారం మాజీ సర్పంచ్ సుమలత శ్రీను,, అబ్దుల్ రహమాన్ (మాజి కో ఆప్షన్ సభ్యులు) గంగాపూర్ మాజీ సర్పంచి జగన్,సందయ్య పల్లె నక్క గంగారం,తదితరులు పాల్గొన్నారు.