జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో గల శ్రీరామ విద్యా మందిర్ ఉన్నత పాఠశాలలో 2023- 2024 పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం రోజున ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.20 సంవత్సరాల తర్వాత నాటి స్నేహితులను కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు ఒకరినొకరు పలకరించుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యాయులను గౌరవంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో శ్రీరామ్ విద్యమందిర్ ప్రధానోపాధ్యాయులు రామకృష్ణారావు,చంద్రమౌళి,లచ్చయ్య,రాజయ్య,గంగాధర్,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.