జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులాపూర్ గ్రామానికి చెందిన బిర్పూర్ శ్రీనివాస్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి రాగ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం రోజున శ్రీనివాస్ ని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం అదే గ్రామానికి చెందిన గోవిందుల మహేందర్ ను క్యాన్సర్ తో చికిత్స పొంది ఇంటికి రాగ మహేందర్ ని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకొని ధైర్యం చెప్పారు.
వారి వెంట బుగ్గారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు వేముల సుభాష్ ఉపాధ్యక్షులు నర్సగౌడ్ యూత్ కమిటీ అధ్యక్షులు అంజిత్ కుమార్ , రెంటం శ్రీధర్, జంగ శ్రీను, తాడేపు ప్రేమ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.