తెలంగాణ టూరిజం శాఖ శుభవార్త చెప్పింది. శ్రీశైలం డ్యాం బ్యాక్‌వాటర్‌లో చేపట్టనున్న క్రూయిజ్ టూర్‌ను ఈ నెల 26న ప్రారంభించనున్నట్టు తెలిపింది. కొల్లాపూర్‌లోని సోమశిల నుంచి శ్రీశైలం వరకు సింగిల్ రైడ్‌తోపాటు రౌండప్ క్రూయిజ్ జర్నీ ధరలను ప్రకటించారు.
సింగిల్ జర్నీలో పెద్ద వాళ్లకు రూ.2 వేలు, చిన్నారులకు రూ.1,600, రౌండప్ జర్నీలో పెద్ద వాళ్లకు రూ.3 వేలు, పిల్లలకు రూ.2,400గా ధరను నిర్ణయించారు.