కాంగ్రెస్ అంటే ఉద్యోగుల సంక్షోభ ప్రభుత్వం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. '165 మంది ఏఈవోలు, 20 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడం దారుణం.
అడ్డగోలు సాకులతో వారిని సస్పెండ్ చేశారు. హక్కులు అడిగితే సస్పెండ్ చేస్తారా?. 2 లక్షల ఉద్యోగాల మాట అటుంచితే.. ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. సస్పెండ్ చేసిన వారిని తక్షణం విధుల్లోకి తీసుకోవాలి' అని Xవేదికగా డిమాండ్ చేశారు.