కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ లో ప్రస్తుత పరిస్థితులను జీర్ణించుకోలేకపోతున్నా.
తీవ్ర మానసిక బాధతో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు లేఖ రాస్తున్నా.. లేఖ రాస్తున్నందుకు విచారిస్తున్నా. కొన్ని స్వార్థపూరిత శక్తులు అభివృద్ధి నెపంతో పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నాయి. పార్టీ ఫిరాయింపులకు పాల్పడకుండా నైతిక విలువలు పాటించాలి' అని అన్నారు.