ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణకు రావాల్సిన అవసరం లేదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
'తెలంగాణ నుంచి మొన్ననే రూ. 15 వేల కోట్లు తీసుకున్నారు. అయినా కూడా ఏం అనలేదు. మన ఆస్తులు కావాలి కానీ.. తిరుమలలో మనకు హక్కు లేదట. తిరుమలలో మా లెటర్ ప్యాడ్స్ తీసుకోవాలి.. మమ్మల్ని గెలిపించిన ప్రజలకు ప్రోటోకాల్ ఇవ్వాలి' అని అన్నారు.