అలంపూర్ నియోజకవర్గంలోని రాజోలి మండల పరిధిలోని తూర్పు గార్లపాడు గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి తండ్రి రామచంద్ర రెడ్డి అనారోగ్యంతో గురువారం మరణించారు.
విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే విజయుడు అక్కడికి వెళ్లడం జరిగినది. మహేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎమ్మెల్యేతో పాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు ఉన్నారు.