తాడ్వాయి మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఎన్. ఎస్. ఎస్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ హరీష్, డాక్టర్ నీరజ విద్యార్థిని విద్యార్థులకు వైద్య పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సయ్యద్ యూసుఫ్ హుస్సేన్, ఎన్. ఎస్. ఎస్ కోఆర్డినేటర్ శ్రీకాంత్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.