కోకాపేట్లో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం నింపింది. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని కోకాపేట్ హాస్టల్ బిల్డింగ్పై నుంచి దూకి నాగ ప్రభాకర్(27) అనే ఐటీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్న నాగ ప్రభాకర్ గత కొన్ని రోజులుగా గచ్చిబౌలిలో ఉంటున్నాడు.కోకాపేట్ హాస్టల్కొచ్చి ఏడో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ యువకుడి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ అని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. పని ఒత్తిడే ఆత్మహత్యకు కారణంగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.