సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం నేడుదీపావళి బోనస్ ఖాతాల్లో జమ చేయనుంది. ఒక్కో కార్మికుడికి రూ.93,750 జమ కానుంది.మొత్తంగా రూ.358 కోట్లు విడుదల చేయాలని సింగరేణిని ఆదేశించింది. బోనస్ 40వేల మందికి అందనుంది. ఇటీవల సంస్థ పొందిన లాభాల్లో 33% వాటా పంచగా ఒక్కో కార్మికుడికి రూ.1.90లక్షలు అందాయి. పండుగ అడ్వాన్స్ కింద మరో రూ.25వేలు అందాయి. మొత్తంగా ఒక్కొక్కరికి రూ3లక్షల ప్రయోజనం చేకూరింది.