భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శించుకున్నారు. ప్రధానాలయంలోని ధ్రువమూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఆ తర్వాత ఆలయానికి అనుబంధంగా ఉన్న ఆంజనేయస్వామి, లక్ష్మీ తాయారు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం పలికారు. ఈవో రమాదేవి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను గవర్నర్‌కు అందజేశారు. అంతకుముందు గవర్నర్‌కు జిల్లా కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్ స్వాగతం పలికారు.