పెద ప్రజల సంక్షేమం కేవలం బీజేపీ తోనే సాధ్యమని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నర్సన్ గౌడ్ అన్నారు. శుక్రవారం మరికల్ మండలం పసుపుల గ్రామంలో నిర్వహించిన ఆన్లైన్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వాలు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు పని చేయాలని కోరారు. అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసి జిల్లాను ముందు వరుసలో నిలబెట్టాలన్నారు.