నాగర్ కర్నూల్ - కొల్లాపూర్ నియోజకవర్గంలో పెంట్లవెల్లి మండలం జెట్ ప్రోలు గ్రామానికి చెందిన ప్రహర్ష అనే యువతికి నారాయణపెట్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు రావడంతో ఆర్ధిక ఇబ్బందులు వల్ల చదివించలేక పోతుందని యువతి తల్లిదండ్రులు అన్ని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చూసి వెంటనే వారి వివరాలు తెలుసుకొని తన MJR చారిటబుల్ ట్రస్టు ద్వారా అ అమ్మాయి ఎంబీబీఎస్ చదవడానికి మొదటి సంవత్సరం ఫీజు 75 వేలు రూపాయల ఆర్ధిక సహాయం అందజేశారు. మిగతా మూడు సంవత్సరాల ఫీజు తన ట్రస్ట్ ద్వారా చెల్లిస్తానని బరోసా ఇచ్చారు.