హయత్ నగర్ లో ఓ మహిళకు SI సైదులు వేధింపులు. భర్త వేధింపులతో ఫిర్యాదు చేయడానికి హయత్ నగర్ పోలీస్ స్టేషన్ వెళ్లిన మహిళ.ఫిర్యాదులో మహిళ ఫోన్ నెంబర్ తీసుకొని తరచూ ఫోన్ చేస్తూ వేధింపులకు గురి చేసిన ఎస్ఐ సైదులు.నీ కేసు నేను పరిష్కరిస్తా నేను మీ ఇంటికి వస్తా అంటూ ఫోన్లు చేస్తూ వేధిస్తున్నాడని మహిళా ఆరోపణ.ఇంట్లో ఎవరు లేని సమయంలో చెప్పు నేను వస్తా అంటూ మహిళకు వాట్సాప్ లో కాల్స్ చేస్తూ వేధిస్తున్న ఎస్ఐ సైదులు.నీ భర్త పై కేసు నమోదు చేయాలంటే నా కోరిక తీర్చాలంటూ మహిళకు వేధింపులు.ఎస్సై సైదులు పై రాచకొండ కమిషనర్ సుధీర్ బాబుకు ఫిర్యాదు చేసిన మహిళ.గత 40 రోజుల నుంచి వేధింపులకు గురి చేస్తున్నాడంటూ సీపీ కి ఫిర్యాదు.విషయం బయటికి రావడంతో మహిళను పోలీస్ స్టేషన్ పిలిచి విషయం వేరే వారికి చెప్పొద్దంటూ సీఐ బెదిరింపులు.